MRPS Protest in Armoor | సీఎంకు పిండ ప్రదానం చేసిన ఎమ్మార్పీఎస్​ నాయకులు

గ్రామ కమిటీల ఆగడాలను అరికట్టాలని ఎమ్మార్పీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే,ఆర్మూర్: MRPS Protest in Armoor | గ్రామ కమిటీల ఆగడాలను అరికట్టాలని ఎమ్మార్పీఎస్​ నాయకులు డిమాండ్​ చేశారు. వారి ఆగడాలకు నిరసనగా ఆర్మూర్​ పట్టణంలోని అంబేడ్కర్​ చౌరస్తాలో సీఎం రేవంత్​రెడ్డికి, వీడీసీల చిత్రపటాలకు పిండప్రదానం చేశారు.

MRPS Protest in Armoor | అంబేడ్కర్​ చౌరస్తాలో..

ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), వీడీసీ చిత్రపటాలకు పిండ ప్రదానం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​ఛార్జి మైలారం బాలు మాట్లాడుతూ.. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్​లో 39 గౌడ, 10 ఎస్సీ గీత కార్మిక కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ కమిటీలను రద్దు చేయాలన్నారు. పోలీసులు అక్కడికి నిరసనకారులను శాంతింపచేశారు.

ఇది కూడా చదవండి..: Indur Corporation Protest | అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఇందూర్ కార్పొరేషన్..: ఎమ్మెల్యే ధన్​పాల్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *