Kavitha KTR Clash | నాతో పెట్టుకోవద్దు..  కేటీఆర్‌కు కవిత వార్నింగ్

భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై , టీఆర్ఎస్ చీఫ్ కవిత కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha KTR Clash | భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై , టీఆర్ఎస్ చీఫ్ కవిత కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి అని కేసీఆర్  ( KCR ) చెప్పడం వల్లే సమస్యలు తమ వరకు రాలేదంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఆమె మండిపడ్డారు. పార్టీలో తన వైఫల్యాన్నంతా అధినేత కేసీఆర్‌పై రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు.

Kavitha KTR Clash | కేసీఆర్‌పై ఆరోపణలు సరికావు..

కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కవిత విమర్శించారు. పార్టీలో తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధినేతను తప్పుపట్టడం సరైన పద్ధతి కాదన్నారు. గుంటనక్క మైండ్ గేమ్‌లో పడి పెద్ద మనిషినే బాధ్యుడిని చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి గోతి తవ్వుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాను గతంలో పార్టీలో ఉన్నప్పుడు ఒక అవినీతిపరుడిని విమర్శిస్తే గంటల్లోనే సస్పెండ్ చేశారని, కానీ ఇప్పుడు అదే వర్గంతో అంటకాగుతూ కేసీఆర్ విధానాల వల్లే నష్టపోయామని చెప్పడం పార్టీ వ్యతిరేక చర్య కాదా అని ప్రశ్నించారు.

Kavitha KTR Clash | క్విడ్ ప్రో కో దందాలపై విమర్శలు..

పార్టీని పాతాళంలోకి నెట్టింది ఎవరో ఆత్మపరిశీలన చేసుకోవాలని కవిత హితవు పలికారు. ఫామ్ హౌస్‌లు, అక్రమ అనుమతులు, ఆంధ్రా దోస్తులకు కట్టబెట్టిన నజరానాలు, క్విడ్ ప్రో కో దందాలతో పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది కేటీఆరేనని ఆరోపించారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో ఒక రైతు ఫోన్ మాట్లాడుతుంటే అతని భార్యను కించపరిచేలా మాట్లాడారని, ఒక మహిళ సాయం కోరి వస్తే దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు.

Kavitha KTR Clash | నాతో పెట్టుకోవద్దు..

నిమజ్జనోత్సవ వేళ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను బతిమాలుకున్న విషయాలు ఆ గణేష్ మహారాజుకు, వారి అంతరాత్మకే తెలుసని కవిత పేర్కొన్నారు. తాను ఎవరి మాటలు వినో, కేవలం గాలి మాటలో మాట్లాడడం లేదని, తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా “నాతో పెట్టుకోవద్దు” అంటూ ఆమె ఘాటుగా హెచ్చరించడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి:  VBG Ramji Scheme | ఉపాధి కూలీలకు ఊరట.. జిల్లాలో జోరుగా వీబీ జీ రామ్‌జీ పనులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *