Kalyana Lakshmi Scheme | కల్యాణలక్ష్మిపై ప్రభుత్వం నిర్లక్ష్యం : హరీశ్​రావు

కల్యాణలక్ష్మి పథకం లక్షలాది ఆడబిడ్డల జీవితాల్లో వెలుగు నింపిందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kalyana Lakshmi Scheme | కల్యాణలక్ష్మి పథకం లక్షలాది ఆడబిడ్డల జీవితాల్లో వెలుగు నింపిందని మాజీ మంత్రి హరీశ్​రావు (Harish Rao) అన్నారు. ఈ పథకంతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. పథకం ప్రారంభించి 12 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన ఎక్స్​వేదికగా పోస్టు చేశారు.

బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 అక్టోబర్ 2న రూ.51,000 ఆర్థిక సాయంతో కేసీఆర్​ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఆ మొత్తాన్ని 2017లో రూ.75,116కు, 2018లో రూ.1,00,116కు పెంచారన్నారు. బీఆర్ఎస్​ పాలనలో 13,15,297 మంది ఆడబిడ్డలకు రూ.11,560 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించామని వెల్లడించారు.

Kalyana Lakshmi Scheme | లబ్ధిదారుల ఎదురుచూపులు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కల్యాణలక్ష్మి పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని హరీశ్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లిళ్లు అయిపోయి.. పిల్లలు పుట్టినా.. కల్యాణలక్ష్మి డబ్బులు అందడం లేదని విమర్శించారు. తమ హయాంలో ఈ పథకం కోసం ఏడాదికి రూ.2500 కోట్లు ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్​ మాత్రం సగం కూడా ఖర్చు చేయడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్​ నాయకులు తర్వాత ఆ హామీని గాలికి వదిలేశారన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలని ఆయన డిమాండ్​ చేశారు. పెండింగ్​లో ఉన్న కల్యాణలక్ష్మి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Inter Internal Marks | ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్​..ఫస్టియర్‌లోనూ ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *