అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bhatti Vikramarka | రాష్ట్రంలో వనరుల సమీకరణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రభుత్వ భూముల విలువను పెంచే అవకాశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క అన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆస్తులను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకునే చర్యలు చేపట్టాలని సూచించారు.
Bhatti Vikramarka | పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి..
అలాగే పర్యాటక రంగాన్ని రాష్ట్రానికి కీలక ఆదాయ వనరుగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అన్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ప్రోత్సాహం ద్వారా ఈ రంగంలో మరిన్ని అవకాశాలను సృష్టించాలని అధికారులకు సూచించారు.
Sheikh Hamdan | ఎంతో ఆప్యాయత.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను పరామర్శించిన UAE ఉప ప్రధాని హమ్దాన్
పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తూ, ప్రభుత్వ వనరులను సమర్థంగా వినియోగించుకునే దిశగా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.