అక్షరటుడే, ఆర్మూర్: Tallarampur VDC Action | తాళ్లరాంపూర్ వీడీసీపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ (BC, SC, ST, JAC), ధర్మసమాజ్ పార్టీ నాయకులు, గౌడ కుల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలో రహదారిపై ధర్నా నిర్వహించారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కండెల సుమన్ మాట్లాడుతూ.. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో వీడీసీ వారు 39 గీత కార్మిక, 11 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారన్నారు. ఈ విషయమై గతనెల 28న కలెక్టర్ (Nizamabad) దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారని ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు జేఏసీ, గౌడ, డీఎస్పీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు.
Tallarampur VDC Action | వీడీసీలను రద్దు చేయాలి
రాజ్యాంగ విరుద్ధమైన వీడీసీలను వెంటనే రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోందన్నారు. వీడీసీ ముసుగులో కొందరు బీసీ,ఎస్సీ ఎస్టీలపై పెత్తనం చెలాయిస్తూ బహిష్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సంఘటనపై ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నికైన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి బాధితుల పక్షాన లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే వారు స్పందించి బాధితుల పక్షాన పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వారు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు రామా గౌడ్, ప్రేమ్, మహిపాల్, మెడ గంగారాం, సుదర్శన్, మురళి, ఉమేష్, మహేష్, భుమేష్, మహిపాల్, మహేష్, నర్సా గౌడ్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. రూ.5,250లు అదనం