Prashanth Reddy Arrest | మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముందస్తు అరెస్ట్​

మాజీ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Prashanth Reddy Arrest | మాజీ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్​ చేశారు. పోలీస్​స్టేషన్​లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందిన సుధాకర్​కు నివాళులు అర్పించేందుకు వస్తున్నారనే సమాచారంతో ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Prashanth Reddy Arrest | పోలీస్​స్టేషన్​ పరిధిలో..

భీమ్​గల్​ (Bheemgal) పోలీస్​స్టేషన్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పొలాస సుధాకర్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఈ నేపథ్యంలో సుధాకర్ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు బయలుదేరిన బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సోమవారం భీమ్​గల్​ పోలీస్‌స్టేషన్ పరిధిలో సుధాకర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ప్రథమ చికిత్స నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలతో ఆయన చనిపోయారు. పోలీసుల వేధింపుల వల్లే సుధాకర్​ ఆత్మహత్య చేసుకున్నాడని  కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ ఘటనలో పోలీసుల తప్పిదమేనని నిజామాబాద్ సీపీ స్పష్టం చేశారు. సంఘటనపై స్పందించిన మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. సంబంధిత ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: BJP District President Arrested | బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అరెస్ట్​..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *