అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad RTA Home Guards | జిల్లా(Nizamabad) రవాణా శాఖ నుంచి ఇద్దరు హోంగార్డులను మాతృశాఖకు సరెండర్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీల (DTC Durga Pramila) వివరాలు వెల్లడించారు.
Nizamabad RTA Home Guards | అవినీతి ఆరోపణల నేపథ్యంలో..
కొన్నేళ్లుగా ఆర్టీఏ పరిధిలోని ఆర్మూర్ యూనిట్లో హోంగార్డు బి. దశరథ్ పనిచేస్తుండగా.. మరో హోంగార్డు భాస్కర్ ఉమ్మడి జిల్లా మొబైల్ స్క్వాడ్లో విధుల్లో ఉన్నారు. వీరిద్దరిపై వస్తున్న అవినీతి ఆరోపణలు వచ్చాయని.. విచారించిన అనంతరం వారిని వారి మాతృశాఖ అయిన నిజామాబాద్ కమిషనరేట్కు సరెండర్ చేశామని కమిషనర్ తెలిపారు. 2008, ఆ తర్వాత రిక్రూట్మెంట్ అయిన ఈ హొంగార్డులు కొన్నేళ్లుగా ఆర్టీఏ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్నారని.. వీరిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
ఇది కూడా చదవండి: టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగుల నిరసన