ACB Raid | పెట్రోల్​ బంక్​ వెరిఫికేషన్​ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్​

యాదాద్రి భువనగిరి జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏసీబీ (ACB) దాడులు చేపడుతున్నా.. భయం లేకుండా లంచాలు తీసుకుంటున్నారు. తాజాగా లీగల్ మెట్రాలజీ ఇన్​స్పెక్టర్​ ఏసీబీ వలకు చిక్కాడు.

యాదాద్రి భువనగిరి (Yadadri) జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఫిర్యాదిదారుడి పెట్రోల్ బంక్‌కు సంబంధించిన వెరిఫికేషన్ సర్టిఫికేట్ జారీ చేసినందుకు, “డైలీ సేల్స్ రిజిస్టర్”ను అప్పగించినందుకు మెట్రాలజీ ఇన్​స్పెక్టర్​ పెట్రోల్ పంప్ టెక్నీషియన్ కాసారం రవీందర్ ద్వారా రూ.20 వేల లంచం డిమాండ్​ చేశాడు.

ACB Raid | ప్రైవేట్ వ్యక్తి ద్వారా

ఈ మేరకు ప్రైవేట్ వ్యక్తి రవీందర్​ ద్వారా బుధవారం లంచం తీసుకుంటుండగా.. నల్గొండ ఏసీబీ అధికారులు (ACB Raid) వల పన్ని పట్టుకున్నారు. రవీందర్​ హైదరాబాద్​ నగరంలోని ఎల్​బీ నగర్​లో ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. అందులో రూ.15 వేలు మెట్రాలజీ ఇన్​స్పెక్టర్​కు, రూ.5 వేలు రవీందర్​ పంచుకుంటారని అధికారులు తెలిపారు. ఈ మేరకు నగదు స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేశారు. ఇద్దరని అరెస్ట్ చేశారు.

దీనిని కూడా చదవండి : Velmal Father Suicide | కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి ఆత్మహత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *