అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Telangana Police Sports | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police) పరిధిలో నిర్వహించనున్న పోలీస్ స్పోర్ట్స్‌ను విజయవంతం చేయాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. జానకంపేట్‌లోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మంగళవారం నిజామాబాద్ డివిజన్ ఏసీపీ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలతో సమీక్ష నిర్వహించారు.
Telangana Police Sports | ఈనెల 25 నుంచి 28వరకు..
రాష్ట్రస్థాయి క్రీడలు ముగింపు కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నవంబర్ 25 నుండి 28 వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని సీపీ పేర్కొన్నారు. వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి క్రీడాకారులకు, ముఖ్య అతిథులకు ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలన్నారు. మత్తుపదార్థాలను అక్రమ రవాణా చేస్తున్న వారిపై పీడీయాక్ట్ వంటి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Telangana Police Sports | సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన..
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులకు వెంటనే స్పందించి సహాయం అందించాలని సీపీ సూచించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్ 112 గురించి ప్రజల వద్దకు చేరే విధంగా అనుక్షణం కృషి చేయాలన్నారు. సమీక్షలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు