అక్షరటుడే, కామారెడ్డి: Car Catches Fire Kamareddy | టీ Tea తాగాలన్న చిన్న ఆలోచన ఆ ఐదుగురి ప్రాణాలను కాపాడింది. లేదంటే కారులోనే సజీవ దహనమైపోయేవారే! కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద బుధవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
Car Catches Fire Kamareddy | రెస్టారెంట్ వద్ద ఆగడంతో తప్పిన ప్రమాదం
కామారెడ్డి కలెక్టరేట్ లోని డీఆర్డీఓ (DRDO) విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని ‘చంద్ర రెస్టారెంట్’ వద్ద టీ తాగేందుకు వారు కారును పక్కకు నిలిపారు.
Car Catches Fire Kamareddy | వెంటనే వ్యాపించిన మంటలు
కుటుంబ సభ్యులంతా కారు దిగి రెస్టారెంట్‌లోకి వెళ్లి టీ తాగి బయటకు వచ్చేలోపే ఊహించని ఘోరం జరిగిపోయింది. కారు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వచ్చి, క్షణాల్లోనే మంటలు కారు నలుమూలలకూ వ్యాపించాయి.
ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కారు మంటల్లో దగ్ధమైంది. స్థానికులు, రెస్టారెంట్ నిర్వాహకులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్‌తో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ, అప్పటికే కారు పూర్తిగా కాలి బూడిదైంది.
Car Catches Fire Kamareddy | దేవుడు ఇచ్చిన సెకండ్ లైఫ్!
ఒకవేళ టీ తాగేందుకు కారు దిగకుండా అలాగే ప్రయాణించి ఉంటే, ఐదుగురు కారులోనే సజీవ దహనమయ్యేవారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. “ఏదో అదృష్టం, దేవుడి దయ వల్ల ముందే ప్రమాదాన్ని పసిగట్టినట్లు టీ తాగాలనిపించి బయటకు వచ్చారు.. అందుకే ఐదుగురి ప్రాణాలు నిలిచాయి” అని అక్కడున్న వారు చర్చించుకున్నారు.
ఇక కారులో మంటలు చెలరేగడానికి కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ, వైరింగ్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..