అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Today | అమెరికా, ఇరాన్ ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)లోని నౌకలతోపాటు యÖఏఈపైనా ఇరాన్ దాడులకు పాల్పడుతుండడంతో పరిస్థితి దిగజారుతోంది.
రూపాయి మరింత పతనమవడం మన మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో ప్రధాన సూచీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
Stock Market Today | నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 166 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 37 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 512 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 20 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 159 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.35 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 600 పాయింట్ల నష్టంతో 76,668 వద్ద, నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 23,934 వద్ద ఉన్నాయి.
Stock Market Today | మిక్స్ డ్ గా సూచీలు..
దేశీయ స్టాక్ మార్కెట్ లోని ఇండెక్స్‌లు మిక్స్ డ్‌గా సాగుతున్నాయి. నిఫ్టీ (Nifty)లో టెలికాం ఇండెక్స్ 0.97 శాతం, ఐటీ 0.17 శాతం, పవర్ 0.14 శాతం లాభాలతో ఉండగా.. రియాలిటీ 1.45 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.14 శాతం, ఎనర్జీ 1.12 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.88 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.72 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.72 శాతం, ఆటో 0.66 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 స్టాక్స్ లాభాలతో, 24 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 0.77 శాతం, కొటక్ బ్యాంక్ 0.75 శాతం, టీసీఎస్ 0.34 శాతం, ఎయిర్ టెల్ 0.14 శాతం, టైటాన్ 0.12 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఎటర్నల్ 1.89 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.59 శాతం, ఎస్ బీఐ 1.44 శాతం, ట్రెంట్ 1.42 శాతం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 1.36 శాతం నష్టంతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Gold Price Today | అతివలకి అదిరిపోయే న్యూస్.. పసిడి ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

