నిజామాబాద్Fogging Mist Machines | ట్రాఫిక్​ సిబ్బంది కోసం ఐల్యాండ్స్​​ వద్ద ఫాగింగ్​ మిస్ట్​ యంత్రాలు:...

Fogging Mist Machines | ట్రాఫిక్​ సిబ్బంది కోసం ఐల్యాండ్స్​​ వద్ద ఫాగింగ్​ మిస్ట్​ యంత్రాలు: సీపీ సాయిచైతన్య

వేసవికాలంలో ట్రాఫిక్​ సిబ్బంది కోసం ఐల్యాండ్​ వద్ద ఫాగింగ్​ మిస్ట్​ యంత్రాలు ఏర్పాటు చేయించినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు.

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Fogging Mist Machines | వేసవికాలంలో ట్రాఫిక్​ సిబ్బంది కోసం ఐల్యాండ్​ వద్ద ఫాగింగ్​ మిస్ట్​ యంత్రాలు(mist system) ఏర్పాటు చేయించినట్లు సీపీ సాయిచైతన్య (cp sai chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో యంత్రాలను ఆయన గురువారం ప్రారంభించారు.

Fogging Mist Machines | ఎండ తీవ్రత తగ్గించడానికి..

వేసవికాలంలో ట్రాఫిక్ సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నగరంలో పలు కూడళ్ల వద్ద ఎండ తీవ్రతను తగ్గించడానికి ఫాగింగ్ మిస్ట్ యంత్రాలను ఏర్పాటు చేయించినట్లు సీపీ తెలిపారు. కోర్ట్ సర్కిల్(Nizamabad Court) వద్ద ఏర్పాటు చేసిన మిస్ట్​ను ప్రారంభించిన అనంతరం యంత్రం పనితీరును ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ మిస్ట్​ యంత్రాల ద్వారా సుమారుగా మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చన్నారు. తద్వారా వేసవి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బందికి ఆరోగ్య రీత్యా ఎదురయ్యే ఇబ్బందులకు రాబోయే రోజుల్లో తగుచర్యలు తీసుకుంటామన్నారు. మిస్ట్ యంత్రాలను ఏర్పాటు చేయడానికి సహకరించిన వాసవి క్లబ్(Vasavi Club) వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్, అశోక్ సిబ్బంది అనిల్, రహీం, నరేష్ షాకీర్, గాంధీ, శంకర్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Traffic Restrictions Telangana| కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి రేవంత్ రెడ్డి కీలక ఆదేశం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mega Job Mela | మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Mega Job Mela | మెగా...

Middle East | మధ్యప్రాచ్యంలో రణభేరి.. ఫుజైరా దాడితో మారిన ఇరాన్ – అమెరికా యుద్ధ గమనం..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Middle East | మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు...

China Ex Defense Ministers|అవినీతిపై చైనా ఉక్కుపాదం..ఇద్దరు మాజీ రక్షణ శాఖ మంత్రులకు మరణశిక్ష

అక్షరటుడే వెబ్‌డెస్క్:China Ex Defense Ministers|అవినీతిపై పోరాటంలో భాగంగా చైనా ప్రభుత్వం...

Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందాలి

అక్షరటుడే, బాన్సువాడ: Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు...