అక్షరటుడే, వెబ్డెస్క్: Modi Telangana Visit | తెలంగాణ (Telangana)లో ప్రధాని మోదీ పర్యటనపై పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Modi Telangana Visit | బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు..
పీసీసీ చీఫ్ (PCC Chief) మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశానికి కాకుండా కేవలం బీజేపీకి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే అవకాశం లేదన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడడం సమంజసం కాదన్నారు. ప్రధానికి రాష్ట్ర స్థితిగతులు బహుశా తెలియకపోవచ్చు అని పేర్కొన్నారు.
Modi Telangana Visit | తెలంగాణ కాంగ్రెస్కు అనుకూలం..
తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్కు అనుకూలమని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ (Congress Party)యేనని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో సెక్యులర్ల ఓట్లు పూర్తిగా తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణకు ప్రధాని ఎన్నిసార్లు వచ్చినా బీజేపీ (BJP) బలపడే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి..: Rashmi Gautam | బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. రష్మీ సంచలన పోస్టు

