అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Bakrid Security Measures | బక్రీద్‌ను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ (dgp cv anand) పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అన్ని జిల్లాల పోలీసు( nizamabad police) ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
Bakrid Security Measures | కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, ఈద్గాలు, మసీదులు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పండుగ రోజున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి, వాహన రాకపోకలను సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈద్గాల వద్ద పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర సేవలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సామాజిక మాద్యమాల ద్వారా ఎలాంటి అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు లేదా వదంతులు వ్యాప్తి చెందకుండా సైబర్ మానిటరింగ్‌ను మరింత బలోపేతం చేయాలని డీజేపీ ఆదేశించారు.
Bakrid Security Measures | సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..
పండుగ విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలలని డీజీపీ సూచించారు. ఎక్కడైనా చిన్న ఘటన జరిగిన వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. వీసీలో జిల్లా నుండి సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya), అదనపు డీసీపీ అడ్మిన్ ఎన్.శుభం ప్రకాష్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్, పశు సంవర్ధక శాఖ అధికారి గంగాధర్, ఆర్మూర్ డీఏవో అచ్యుత్ రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీ లు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case | నాకు రెండు రోజుల సమయం కావాలి.. పోలీసులకు బండి భగీరథ్ లేఖ

