తెలంగాణRevanth Reddy Convoy | సీఎం రేవంత్​రెడ్డి కాన్వాయ్​లో వాహనాల తగ్గింపు!

Revanth Reddy Convoy | సీఎం రేవంత్​రెడ్డి కాన్వాయ్​లో వాహనాల తగ్గింపు!

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించనున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Convoy | సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన కాన్వాయ్​లో 9 వాహనాలు ఉండగా 4 నుంచి 5 వాహనాలకు కుదించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

దేశంలో పెట్రోల్​, డీజిల్​ ఆదా చేయాలని ప్రధాని మోదీ (PM Modi) ప్రజలను కోరిన విషయం తెలిసిందే. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈ మేరకు స్వయంగా తన కాన్వాయ్​లోని వాహనాల సంఖ్యను తగ్గించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సైతం వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు భద్రతా వ్యవహారాలను చూసే పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Revanth Reddy Convoy | మంత్రుల కాన్వాయ్​లో సైతం

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంధనం ఆదా చేయాలని ప్రధాని ప్రజలను కోరారు. విద్యుత్​ వాహనాలను, ప్రజారవాణాను వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు కాన్వాయ్​లో వాహనాల సంఖ్య తగ్గించుకుంటున్నారు. తెలంగాణ (Telangana)లో సైతం మంత్రుల కాన్వాయ్​లో సైతం వాహనాలు తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్ని వాహనాలను తగ్గించాలనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఇది కూడా చదవండి..: Rabi Paddy Procurement | ముమ్మరంగా వరి కొనుగోళ్లు.. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.. రైతుల ఖాతాల్లో రూ.4,520 కోట్లు జమ!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Marco Lu Name Change | పేరు మార్చుకున్న అమెరికా మంత్రి.. అసలు కారణం అదేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Marco Lu Name Change | అగ్రరాజ్యం అమెరికా...

Global Cost Cutting | అంతటా పొదుపు మంత్రమే.. 40కి పైగా దేశాల్లో ఆంక్షలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Global Cost Cutting | అమెరికా (America), ఇరాన్‌ల...

CM VD Satheesan | కేరళం సీఎంగా వీడీ సతీషన్​.. కాంగ్రెస్​ ప్రకటన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM VD Satheesan | కేరళం సీఎం...

PMJ Jewellery Robbery|పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

అక్షరటుడే వెబ్‌డెస్క్:PMJ Jewellery Robbery|కరీంనగర్‌లోని పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్‌లో కాల్పులు...