క్రైంHyderabad Fire Accident | ఫర్నిచర్​ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

Hyderabad Fire Accident | ఫర్నిచర్​ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్​ నగరంలోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసిఫ్​ నగర్​లోని ఎంజే ఫర్నిచర్​ గోదాంలో మంటలు చెలరేగాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Fire Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని మరో ఫర్నిచర్​ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసిఫ్​ నగర్​లోని ఎంజే ఫర్నిచర్​ గోదాంలో గురువారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

గోదాంలో లోపల నిల్వ ఉంచిన భారీ మొత్తంలో ఉన్న ఫర్నీచర్ స్టాక్ మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. రెండు అగ్నిమాపక వాహనాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోగా, మంటలను అదుపు చేసే పనులు కొనసాగుతున్నాయి. ఈ గోదాం అత్యంత జనసాంద్రత కలిగిన నివాస ప్రాంతంలో ఉంది.

Hyderabad Fire Accident | పెద్ద ఎత్తున మంటలు

ఎంజే క్లాసిక్ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలో ఉన్న కలప, పాలిష్ కెమికల్స్ వంటి వస్తువులతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ అలుముకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు.

Hyderabad Fire Accident | భారీ ఆస్తి నష్టం

ఈ ప్రమాదం జరిగిన బిల్డింగ్‌లోనే పైన రెండు అంతస్తుల్లో నివాస అపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. దీంతో ప్రజలు మరింత ఆందోళన చెందారు. మంటలు పై వరకు వ్యాపిస్తే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతుందని భయపడ్డారు. అయితే అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. అపార్ట్​మెంట్​లోని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రమాదంతో ఆసిఫ్ నగర్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్​ జామ్ అయింది.

 

ఇది కూడా చదవండి : RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ

 

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hantavirus Vaccine Delay|పదేళ్ల క్రితమే రావాల్సిన ‘హంటా’ టీకా ఎందుకు రాలేదు? దీని వెనుక షాకింగ్ మిస్టరీ ఇదే!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hantavirus Vaccine Delay|ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న హంటా వైరస్‌కు (Hantavirus)...

Nizamabad Ring Road | నగరానికి రింగ్​ రోడ్డు కేటాయించకపోవడం దురదృష్టకరం: ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Ring Road | నిజామాబాద్ నగరానికి రింగ్...

NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..

అక్షరటుడే, కామారెడ్డి: NEET Paper Leak | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన...

Pamula Vagu Bridge | వంతెన నిర్మించలేనందుకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

అక్షరటుడే, లింగంపేట: Pamula Vagu Bridge | మండలంలో (lingampet) వంతెన...