నిజామాబాద్Paddy Procurement Promises | రైతులకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది.: డీసీసీ...

Paddy Procurement Promises | రైతులకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది.: డీసీసీ అధ్యక్షుడు నగేష్​రెడ్డి

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కాంగ్రెస్​ భవన్​లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Paddy Procurement Promises | రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కారు రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ(Nizamabad District Congress Committee) అధ్యక్షుడు నగేష్ రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కాంగ్రెస్​ భవన్​లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Paddy Procurement Promises | ప్రతిపక్షాలవి బూటకపు మాటలు..

జిల్లాలో ప్రతిపక్షాలు బూటకపు మాటలతో రైతులను రెచ్చగొడుతూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయిస్తున్నాయని నగేష్​ రెడ్డి అన్నారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్​తో, అధికార యంత్రాంగంతో సీఎం సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5.82లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెప్పారు. ఇప్పటికే రూ.1181 కోట్లను రైతుల ఖాతాల్లోకి జమ చేసిందన్నారు.

Paddy Procurement Promises | అత్యధిక కొనుగోళ్లు నిజామాబాద్​లోనే..

రాష్ట్రవ్యాప్తంగా నిజామాబాద్(Nizamabad) జిల్లానే అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిగాయని నగేష్​ రెడ్డి పేర్కొన్నారు. అందులో 50వేల మెట్రిక్ టన్నుల దొడ్డురకం వడ్లను కొనుగోలు చేశామని, దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేయడానికి కేంద్రం నుండి అనుమతి రావాలని ఎందుకంటే దొడ్డు వడ్లను రైస్ మిల్లులకు బాయిల్డ్ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో కేంద్రం ఆలస్యంగా అనుమతి ఇచ్చిందన్నారు. జిల్లాకు 70 వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్​ వడ్లు కొనుగోలు చేయడానికి అనుమతి వస్తే ఇప్పటికే 50వేల టన్నుల దొడ్డు రకం కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

Paddy Procurement Promises | ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..

రాబోయే పది రోజుల్లో జిల్లాలో మిగిలిపోయిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు తెలిపారు. జిల్లాలో ఉన్న సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy), మహేష్ కుమార్ గౌడ్​, భూపతి రెడ్డి ఎల్లప్పుడు కలెక్టర్​తో ప్రభుత్వ అధికారులతో సమీక్షలు జరుపుతున్నారన్నారు. మంత్రిగా చేసిన ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో తప్ప జిల్లాలో ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు. ఆర్​అండ్​బీ మంత్రిగా ఉన్నప్పుడు కనీనం నిజామాబాద్​ బైపాస్​ రోడ్డు పనులు కూడా పూర్తి చేయలేకపోయారన్నారు.

బీఆర్ఎస్ కార్యకర్తలను రైతుల్లా చూపుతూ.. నిజం రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైన సుదర్శన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి భక్తవత్సలం, జిల్లా ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్, జిల్లా ఫిషరీస్ ఛైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ రఘు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : Chandrababu Population Policy | మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు ఇస్తాం : ఏపీ సీఎం చంద్రబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్, అక్రమ కల్లు లైసెన్స్ ఆరోపణలపై ఇద్దరికి నోటీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Illegal Toddy License | నకిలీ సర్టిఫికెట్ సమర్పించి...

CBSE Three Language Rule | CBSC బోర్డు కీలక నిర్ణయం.. 9, 10 తరగతులకు కొత్త త్రీ-లాంగ్వేజ్ రూల్..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CBSE Three Language Rule | సీబీఎస్ఈ బోర్డు...

BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతకు వెలికితీయడంలో బాల్​భవన్​ పాత్ర గొప్పది: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: BalBhavan Nizamabad | చిన్నారుల్లో సృజనాత్మకతకు వెలికితీయడంలో...

Drug Abuse Awareness | మత్తు పదార్థాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drug Abuse Awareness | మత్తు పదార్థాలు...