అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Water Supply |కామారెడ్డిలో దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపిన ఘనత ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీకే(Shabbir Ali) దక్కుతుందని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
Kamareddy Water Supply | 20ఏళ్ల క్రితం ఎండాకాలం వస్తే..
పట్టణంలో 20 ఏళ్ల క్రితం ఎండాకాలం వస్తే ఖాళీ బిందెలతో ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. వైఎస్సార్ హయాంలో మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ శ్రీరాంసాగర్ (Sriram Sagar) నుంచి 110కి.మీ. పైపులైన్ వేయించి, మల్లన్నగుట్ట (Mallanna gutta) వద్ద ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి గోదావరి జలాలు తెచ్చారని తెలిపారు. దీంతో పదేళ్లు నీటి కష్టాలు తీరాయన్నారు. ప్రస్తుతం పెరిగిన అవసరాలకు అనుగుణంగా అటవీ, ఆర్అండ్బీ అనుమతులు సాధించి కొత్త పైపులైన్ పనులు పూర్తి చేయించారని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో 4 ఎంఎల్డీ నుంచి 19 ఎంఎల్డీ వరకు నీటి సరఫరా పెరుగుతుందని వివరించారు.
వేసవిలో వార్డుల్లో తిరిగే ట్యాంకర్లు ఇప్పుడు కనిపించడం లేదని, షబ్బీర్ అలీ నిరంతర సమీక్షల వల్లే రోజూ 8-10 ఎంఎల్డీ నీరు నల్లాల ద్వారా వస్తోందని పేర్కొన్నారు. అమృత్ 2.0 కింద సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) చొరవతో, షబ్బీర్ అలీ సహకారంతో మరో 9 వాటర్ ట్యాంకులు రూ.11.89 కోట్లతో మంజూరయ్యాయని తెలిపారు. ఇవి పూర్తయితే నీటి సమస్య పూర్తిగా తీరుతుందని, అందుకే ఈ ఘనత అంతా షబ్బీర్ అలీదేనని ఛైర్‌పర్సన్ కొనియాడారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంతరావు, కౌన్సిలర్లు, మిషన్ భగీరథ సిబ్బంది పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Hyderabad Crime News|హైదరాబాద్‌లో ఘోరం.. సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని యువతిపై గ్యాంగ్ రేప్


