అక్షరటుడే, వెబ్‌డెస్క్: Arvind Comments on KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ (MP Arvind) ఫైర్ అయ్యారు. జగిత్యాల సభలో కేసీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షనేతగా ప్రతిరోజూ ప్రజల మధ్య ఉండాల్సిన నేత.. ఏడాదికోసారి బయటకు వస్తున్నారన్నారు. కేసీఆర్ శకం ముగిసిందని.. ఆయన కొడుకుకు ఓట్లు పడబోవని.. బయటకు వచ్చి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అంత అబద్ధాల కోరు చరిత్రలో ఎవరూ లేరన్నారు.
Arvind Comments on KCR | మంత్రి పదవి ఇవ్వనందుకు పార్టీ
గల్ఫ్ వలసలు ఆపుతానని చెప్పిన కేసీఆర్ (KCR) .. ఆయన ఇంట్లో ఇద్దరిని వలస నుంచి తిరిగి తీసుకొచ్చి పునరావాసం కల్పించారని అర్వింద్ అన్నారు. మంత్రి పదవి ఇవ్వనందుకు కేసీఆర్ పార్టీ పెట్టారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయానికి వాడుకుంది కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. ఎంతో మంది నేతలను మోసం చేశారని మండిపడ్డారు. సెంట్రలైజ్డ్ కరప్షన్ కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక్కటి చేశాడని.. మిషన్ కాకతీయ పెట్టి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
Arvind Comments on KCR | బీఆర్ఎస్ చావు నువ్వు చూడాలే..
కేసీఆర్‌కు తెలంగాణ (Telangana)పై నయా పైసా ప్రేమ లేదని ఎంపీ అన్నారు. కేవలం కుటుంబం, అవినీతి చేశారన్నారు. ఉద్యమాన్ని కేవలం అధికారం కోసం మాత్రమే నడిపారన్నారు. ఆయనను జాతిపిత అని ఎలా అంటారని ప్రశ్నించారు. కేసీఆర్ చావాలని ఎవరూ కోరుకోవడం లేదని అర్వింద్ అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) చావును చూడాల్సి ఉందన్నారు. కూతురు జైలుకు వెళ్లడం చూశారని.. కొడుకు కూడా జైలుకు వెళ్లడం చూడాలన్నారు. కొడుకు, కూతురును తిరిగి అమెరికాకు పంపిస్తే తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుందని వ్యాఖ్యానించారు. అలాగే హరీశ్‌రావు, సంతోష్‌ను కూడా పంపించేయాలన్నారు. అప్పడే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం దూరమవుతుందని అర్వింద్ అన్నారు.

Arvind Comments on KCR | ఆ ఇద్దరికి లాగుల మీద ప్రేమ
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇద్దరికి లాగులంటే ప్రేమ అని ఎద్దేవా చేశారు. ఒకరేమో లాగులో తొండలు అంటారు.. ఇంకొకరేమో లాగులు పగిలేదాకా కొట్టాలంటారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో అగ్రికల్చర్ పాలసీ లేదు
రాష్ట్ర ప్రభుత్వానికి అగ్రికల్చర్ పాలసీ లేదని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పంటలు పండిస్తే వానాలకు తడిచిపోతున్నాయన్నారు. ఎఫ్‌సీఐ కేవలం ఫుడ్ సెక్యురిటీ కోసం ధాన్యం సేకరిస్తుందని.. మొత్తం కొనుగోలు చేయాలని ఎలా అంటారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటుకు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల రైతులకు ఎంతో ఉపయోగం అవుతుందన్నారు. రైస్ బ్రాన్ ఆయిల్ ఇండస్ట్రీలు, వరి ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు స్థాపిస్తే బాగుంటుందన్నారు.
ఇది కూడా చదవండి..: crop procurement | పంట కొనుగోళ్లపై కొర్రీలు పెట్టడం సరికాదు..

