అక్షరటుడే, వెబ్డెస్క్ : Nalgonda ACB Trap | నల్గొండ జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) కార్యాలయంలోని సర్వే, భూ రికార్డుల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు. లంచం తీసుకుంటుండగా అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే సర్వే, భూ రికార్డుల డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ (DI) పవన్ కుమార్ సర్వే నివేదికను జారీ చేయడానికి లంచం డిమాండ్ చేశాడు. రూ.35 వేలు ఇస్తేనే పని చేస్తానని చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదుదారుల నుంచి నల్గొండ కలెక్టరేట్ సమీపంలో రూ.15 వేల లంచం తీసుకుంటుండగా డీఐ పవన్ కుమార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంతకుముందు, డిమాండ్ చేసిన రోజున నిందితుడు ఫిర్యాదిదారుడి నుంచి రూ. 20వేలు లంచం తీసుకున్నాడు.
Nalgonda ACB Trap | మారని తీరు
రాష్ట్రంలో అవినీతి అధికారుల తీరు మారడం లేదు. ప్రజల నుంచి లంచాలు తీసుకొని భారీగా ఆస్తులు కూడబెడుతున్నారు. ఇటీవల పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలో ఏసీబీ దాడులు చేయగా రూ.వందల కోట్ల అక్రమాస్తులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఏసీబీ కేసులు, దాడులు పెరిగినా లంచాలకు మరిగిన అధికారులు మాత్రం మారడం లేదు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.
Nalgonda ACB Trap | లంచం ఇవ్వొద్దు
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్సైట్ (ACB Website) ద్వారా కంప్లైట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇది కూడా చదవండి : Revanth Reddy Education | విద్యాశాఖను వికాసం వైపు నడిపిస్తున్నాం : సీఎం రేవంత్రెడ్డి