KTR Warning to Police | వారిని ఎవరూ కాపాడలేరు.. పోలీసులకు కేటీఆర్​ వార్నింగ్​

సీఎం రేవంత్​రెడ్డి ఆరిపోయే దీపమని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. పరిగి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : KTR Warning to Police | సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆరిపోయే దీపమని బీఆర్​ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ అన్నారు. పరిగి నియోజకవర్గంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసిందని మండిపడ్డారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్రంలో ఎస్​ఐఆర్​, పార్టీ సభ్యత్వ నమోదుపై బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో పరిగిలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ.. కొందరు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను సతాయిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్​రెడ్డి ఆరిపోయే దీపమని, ఆయన ఎక్కువ రోజులు అధికారంలో ఉండరన్నారు. ఆ తర్వాత తమ పార్టీ కార్యర్తలను వేధించిన పోలీస్ అధికారుల్ని కాపాడేవాళ్లు ఎవరూ ఉండరని తెలిపారు. డ్యూటీ చేయండి… అతి చేయకండి అని హితవు పలికారు. రిటైర్ అయినా, ఎక్కడ దాకున్నా.. తమ సర్కార్ వచ్చాక ఒక్కొక్కరిని వెతికి మరీ మిత్తితో సహా తిరిగిచ్చే బాధ్యత తనదని హెచ్చరించారు.

KTR Warning to Police | కాంట్రాక్టులు ఇస్తామని..

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 72 శాతం కాంట్రాక్టులు ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారని కేటీఆర్​ గుర్తు చేశారు. అంటే.. రూ. 4,400 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మూడు వేల కోట్ల కాంట్రాక్టులు ఇవ్వాలన్నారు. కానీ మూడు రూపాయలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. అంబేడ్కర్ అభయహస్తం పేరు మీద రూ. 12 లక్షలు ఇస్తమని, పన్నెండు పైసలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు.

KTR Warning to Police | భూములు గుంజుకుంటున్నారు

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్​ నేతలు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తమమని హామీలు ఇచ్చినట్లు కేటీఆర్​ తెలిపారు. అయితే అధికారంలోకి రాగానే.. పరిగిలో అసైన్డ్ భూముల గుంజుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మూడుసార్లు రైతుబంధు (Rythu Bandhu) ఎగ్గొట్టిందన్నారు.

KTR Warning to Police | రాజకీయ సన్యాసం తీసుకుంటా

రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలోని 1.67 కోట్ల ఆడ కూతుర్లకు ఖాతాలో రూ.1.50 లక్షల చొప్పున వేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Drug Free Telangana | డ్రగ్ ఫ్రీ తెలంగాణే లక్ష్యం.. యువతకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సందేశం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *