Rythu Bharosa Funds | 6 ఎకరాల వరకు రైతు భరోసా జమ

ప్రభుత్వం ఆరు ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా జమ చేసింది. శనివారం రూ.545 కోట్లను విడుదల చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa Funds | వానాకాలం సీజన్​కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం వేగంగా అందిస్తోంది. శనివారం ఆరు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా జమ చేసింది. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) జూన్​ 30న రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి రోజు రెండు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

Rythu Bharosa Funds | రూ.7,135 కోట్లు విడుదల

రైతు భరోసా కింద ఇప్పటి వరకు ఆరు ఎకరాల్లోపు రైతులకు మొత్తం రూ.7,135 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తొలి రోజు రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న వారి ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు వేసింది. తర్వాత రోజుకో ఎకరం పెంచుకుంటూ నిధులు విడుదల చేస్తోంది. మరో మూడు రోజుల్లో అందరి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని తెలిపింది. ఇప్పటి వరకు 67.44 లక్షలకు పెట్టుబడి సాయం అందింది.

Rythu Bharosa Funds | రైతుల హర్షం

రైతు భరోసా నిధులను వేగంగా విడుదల చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్​లో డబ్బులు ఆలస్యంగా విడుదల చేశారు. అది కూడా రెండు ఎకరాల వరకే నిధులు విడుదల చేయడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వానాకాలం సీజన్​లో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం వేగంగా నిధులను జమ చేస్తోంది. గత వానాకాలంలో కూడా రూ.9 వేల కోట్లను తొమ్మిది రోజుల్లో జమ చేసిన విషయం తెలిసిందే.

 

దీనిని కూడా చదవండి : Urea Production | దేశంలో యూరియా ఉత్పత్తి పెంచాం : ప్రధాని మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.