అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తన పార్టీలో బీసీలు, మహిళలకు అవకాశాలు కల్పిస్తానని కవిత గతంలో పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలో తాజాగా ఇన్ఛార్జీల నియామకంలో బీసీలకు పెద్ద పీట వేశారు. 23 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించగా.. అందులో 12 మంది బీసీ నేతలకు స్థానం కల్పించారు.. ఐదుగురు ఎస్సీలు, ఎస్టీ నేత ఒకరికి అవకాశం కల్పించారు. ఆరు చోట్ల ఓసీ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించారు. మిగతా నియోజకవర్గాలకు త్వరలో ఇన్ఛార్జీలను నియమిస్తామని ప్రకటించారు. కొత్తగా నియామకం అయిన వారు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని కవిత సూచించారు.
Telangana Rakshana Sena | ఇన్చార్జీలు వీరే..
సిర్పూర్– కావేసి సబిత, బెల్లంపల్లి– బోడ జనార్దన్, బోథ్ – రాథోడ్ బాపూరావు, ఆర్మూరు – మంథెన నవీన్‌రెడ్డి, ఎల్లారెడ్డి – సంపత్ గౌడ్, కామారెడ్డి – నంగునూరి రవీందర్ గుప్తా, జగిత్యాల – పునుగోటి పవన్ రావు, మానకొండూరు – చెన్నమల చైతన్య, సిరిసిల్ల – ఎండీ అబ్దుల్ మాజీద్, సంగారెడ్డి – దయాకర్‌రెడ్డి, అంధోల్ –మాసన్నగారి బాలయ్య, నారాయణఖేడ్ – మలిశెట్టి బాపు, నర్సాపూర్ – చెల్లంగారి అపర్ణ, మెదక్ – బట్టి అజయ్, శేరిలింగంపల్లి – వాసిలి చంద్రశేఖర ప్రసాద్, తుంగతుర్తి – సూరారపు కృష్ణవేణి, స్టేషన్ ఘన్పూర్ – చిలుక ప్రవీణ్, మక్తల్ – వెంకటన్న, గద్వాల్ – రంజిత్‌కుమార్, నారాయణ్‌పేట – శ్రీనివాస్, మునుగోడు – కర్నాటి మాధవి, పెద్దపల్లి – సలేంద్ర కొమురయ్య, హుస్నాబాద్ – శ్రావణ్ కుమార్ గౌడ్.
దీనిని కూడా చదవండి : CBSE On-Screen Marking | సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్‌లో లోపాలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం