తెలంగాణKavitha Criticizes KCR | అవినీతి పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్న కేసీఆర్​ : కవిత

Kavitha Criticizes KCR | అవినీతి పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్న కేసీఆర్​ : కవిత

మాజీ సీఎం కేసీఆర్​ లక్ష్యంగా కవిత విమర్శలు చేశారు. అవినీతి పందికొక్కుల్ని పక్కన పెట్టుకున్నారని విమర్శించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha Criticizes KCR | తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్​ (KCR) లక్ష్యంగా కవిత విమర్శలు చేశారు. పార్టీ పేరు ప్రకటించిన అనంతరం కేసీఆర్​, బీఆర్​ఎస్​ టార్గెట్ చేశారు. గతంలో ‘‘నా బిడ్డ, కొడుకు తప్పు చేస్తే పార్టీ నుంచి తీసేస్తానని గతంలో కేసీఆర్‌ చెప్పార’’ని కవిత అన్నారు. అవినీతి జరిగిందన్న తనను బయటకు పంపి, అవినీతి పందికొక్కుల్ని పక్కనపెట్టుకున్నారని ఆరోపించారు. ఆయన మన కేసీఆర్​ కాదని, ఆత్మలేని మరబొమ్మ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎదురుగా నిలిచి పోరాడుతానని, తనతో కలిసి రావాలని ప్రజలను కోరారు.

Kavitha Criticizes KCR | ఆ సారు రారు

మన కేసీఆర్‌ అయ్యుంటే పాలమూరు ప్రాజెక్టు (Palamuru Project)ను కట్టించేవారని కవిత అన్నారు. మారిన కేసీఆర్‌ పంజాబ్‌ వెళ్లారు.. జాతీయ పార్టీ పెడతానని చెప్పారని విమర్శించారు. హైడ్రా ఇళ్లను కూలుస్తున్న కేసీఆర్​ బయటకు రాలేదన్నారు. వరదలకు రైతులు నష్టపోయినా.. వెలుగుమట్లలో ఇళ్లు కూల్చిన వెళ్లలేదన్నారు. ఆ సారు ప్రజలకు సమస్య వస్తే రారని విమర్శించారు. ఆయన గుంటనక్కలు, తోడేళ్ల మధ్య ఇరుక్కున్నారన్నారు. ఆయన మారుతారేమోనని చూశానని, కానీ తననే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Kavitha Criticizes KCR | కేటీఆర్​కు తెలియదు

కేసీఆర్​ రాజకీయ పరిణతి కోల్పోయి మాట్లాడుతున్నారని కల్వకుంట్ల కవిత అన్నారు. కేటీఆర్​ (KTR) మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చని, ఆయనకు పెద్దగా తెలియదని ఎద్దేవా చేశారు. అధికారం ఇయ్యకపోతే ప్రజలు తప్పు చేశారని మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణలో ప్రస్తుతం కర్కోటకుడి పాలన నడుస్తోందన్నారు. అయినా కేసీఆర్​ ప్రజల కష్టాలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kavitha Criticizes KCR | ఆనాడే మాట్లాడిల్సింది..

ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే తాను మాట్లాడిల్సిందన్నారు. నాడు వారికి జరిగిందే.. ఈ రోజు తనకు జరిగిందన్నారు. ఉద్యమంలో కొట్టినవారినే తీసుకొచ్చి పట్టం కట్టారని విమర్శించారు. వాళ్ల అనుచరులు మనవాళ్లను అణగతొక్కారని ఆరోపించారు. ఉద్యమకారులను నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చినా సరిపోయేదన్నారు. బీఆర్​ఎస్​లో అమ్మతనం పోయింది, మమకారం పోయిందన్నారు. బీఆర్​ఎస్​కు అధికారం రాగానే.. మమకారం పోయిందన్నారు.

Kavitha Criticizes KCR | రేవంత్​రెడ్డి కర్కోటకుడు

రాష్ట్రంలో కర్కోటకుడి పాలన నడుస్తోందన్నారు. అన్ని అనుమతులు ఉన్నా పేదల ఇళ్లు కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా.. సీఎం (CM Revanth Reddy) మాట్లాడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు. మనమే ప్రధాన ప్రతిపక్షంగా పోరాడాలని, రెండేళ్ల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Kavitha Criticizes KCR | ప్రైవేట్​లో సైతం ఉచిత విద్య.. వైద్యం

బీఆర్​ఎస్​, బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలపై పాంచజన్యం పూరిస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఐదు హామీలు నెరవేరుస్తామని ప్రకటించారు. నాడు కేసీఆర్​ ప్రభుత్వ బడులను మూసేశారన్నారు. నేడు రేవంత్​రెడ్డి అదే కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఊరిలో ఒక బడి ఉండాలని, ప్రతి తరగతిలో ఒక టీచర్​ ఉండాలని డిమాండ్​ చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రైవేట్​ బడులు, విద్యా సంస్థల్లో సైతం ఉచిత విద్య అందిస్తామన్నారు. ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో రైతులకు కూర్చొబెట్టి పనులు చేసేలా చర్యలు చేపడుతామన్నారు. రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు ఇచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు. మొదటి ఏడాదిలోనే సింగిల్‌ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమకారులకు లక్ష సూపర్‌ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఐదో అంశం సామాజిక న్యాయం సాధించి తీరుతామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: Telangana Rashtra Sena | కేసీఆర్​ మన మనిషి కాదు.. మర మనిషి.. కవిత సంచలన వ్యాఖ్యలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...