అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో చెప్పి ఓ వ్యక్తి బయటకు వెళ్లపోయాడు.. సమాచారం అందుకున్న పోలీసులు సమయస్ఫూర్తితో ఎట్టకేలకు అతడిని కాపాడారు.
Kamareddy Police | కామారెడ్డి పట్టణంలో..
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే డయల్-100కు సమాచారం అందించారు. వారు వెంటనే కామారెడ్డి పోలీసు సిబ్బంది, బీట్ కానిస్టేబుల్ అరుణ్‌తో పాటు ఇతర సిబ్బంది వెంటనే గాలింపు చేపట్టారు. కేవలం 10 నిమిషాల్లోనే ఆ వ్యక్తి రైల్వే ట్రాక్‌పై ఉన్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ప్రతి ప్రాణం అమూల్యమైనదని, ఏ సమస్యకైనా ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. ఆపదలో ఉన్నవారు వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు సమాచారం ఇస్తే పోలీసులు తక్షణమే స్పందిస్తారని తెలిపారు. మానసిక ఒత్తిడి లేదా నిరాశతో ఎవరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, అవసరమైతే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Navodaya Admissions | ‘నవోదయ’లో ప్రవేశాలకు వేళాయే.. కార్పొరేట్‌కు సరితూగేలా విద్యాబోధన