అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rayadurg Land | రాయదుర్గం భూముల వేలం ఆపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.
రాయదుర్గంలోని సర్వే నెం. 83/1లో ఉన్న 10.63 ఎకరాల భూమికి సంబంధించి ఆగస్టు 17, 21 తేదీలలో జరగాలన్న టీజీఐఐసీ (TGIIC) ప్రతిపాదిత వేలాన్ని తక్షణమే నిలిపి వేయాలని హరీశ్‌రావు పేర్కొన్నారు. సర్వే నెం. 83ను వారసత్వ ప్రదేశంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఎస్బీఐ (SBI), వక్ఫ్ హక్కులకు సంబంధించిన యాజమాన్యపు వాదనలు ఇప్పటికే న్యాయ పరిశీలనలో ఉన్నాయన్నారు. వివాదాలు పరిష్కారం కాకుండా ఉన్నప్పుడు, మూడవ పక్షాల ప్రయోజనాలు ఏర్పడకుండా నిరోధించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు కూడా నొక్కి చెప్పింది.
Rayadurg Land | చర్యలు చేపట్టాలి
10.63 ఎకరాలకు సంబంధించి వేలంపాటలను తక్షణమే నిలిపివేయాలని ఆయన కోరారు. యాజమాన్యం చట్టబద్ధంగా నిర్ధారించబడే వరకు వివాదాస్పద భూమిపై అన్ని అమ్మకాలు, బదిలీలు, రిజిస్ట్రేషన్, అభివృద్ధి కార్యకలాపాలను నిలిపివేయాలన్నారు. ఎస్బీఐ యాజమాన్యపు దావాతో సహా 6.2 ఎకరాల మునుపటి వేలం, పెండింగ్‌లో ఉన్న హైకోర్టు విచారణలను సమీక్షించాలని పేర్కొన్నారు. వక్ఫ్ రికార్డులు అదృశ్యం కావడంపై స్వతంత్ర విచారణ చేపట్టాలన్నారు. భూమి వక్ఫ్ ఆస్తి అయితే చట్ట ప్రకారం రక్షణ కల్పించాలని కోరారు.
ఇది కూడా చదవండి: Rain Alert | నేడు తేలికపాటి వర్ష సూచన