అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao Counter | మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti)కి మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో తన మామపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
తన మామ భూ కుంభకోణం చేశాడని పొంగులేటి చెప్తున్నారని, కానీ 1995లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓ వ్యక్తి భూమి ఆ భూమి కొనుగోలు చేశారన్నారు. 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమికి ఎన్వోసీ ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో తన మామ ఆ భూమిని కొన్నారని చెప్పారు. ఆ భూమి విలువ రూ.15 కోట్లు అని పొంగులేటి చెప్తున్నారని, రూ.50 లక్షలు ఇచ్చి భూమి తీసుకోవాలన్నారు. అసెంబ్లీలో మంత్రి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. మంత్రి కొడుకు, రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బాగోతం కప్పిపుచ్చడానికి తన మీద బురద చల్లుతున్నారని విమర్శించారు.
Harish Rao Counter | సీఎం ఇల్లును ఎందుకు తీసేశారు
22Aతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని హరీశ్‌రావు (Harish Rao Counter) తెలిపారు. ఈ విషయాన్ని గతంలో మంత్రి కోమటిరెడ్డి సైతం చెప్పారు. అయితే సభలో పొంగులేటి అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22Aలో ఎన్ని ఎకరాలు పెట్టారో సమాధానం చెప్ప లేదన్నారు. 22Aలో తప్పుగా రైతుల భూములు చేర్చినట్టు ఒప్పుకున్నారని తెలిపారు. అయితే క్షమాపణలు చెప్పకుండా తప్పించుకున్నారని విమర్శించారు. సీఎం ఇల్లు కూడా 22Aలో పెడితే, రాత్రికి రాత్రే జాబితా నుంచి తీసేశారని, మరి రైతుల భూములు ఎప్పుడు తీస్తారని ప్రశ్నించారు. 22–ఏ జాబితా ఎప్పటి నుంచో ఉంటే సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన నిలదీశారు. రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నించారు.
22A గురించి బీఆర్ఎస్ లేవనెత్తిన ఒక్క ఆరోపణకు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం చెప్పలేదు
2025 డిసెంబర్ నెలలో మేము అప్లోడ్ చేసిన ఒక లిస్ట్ వల్లే ఈ తప్పు జరిగిందని అసెంబ్లీ సాక్షిగా పొంగులేటి ఒప్పుకున్నాడు
ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ చెప్తాడు, 22A ద్వారా నిషేధిత… pic.twitter.com/sbP3uOK85B
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2026
దీనిని కూడా చదవండి : Minister Ponguleti | ప్రభుత్వ భూమిని మామకు కట్టబెట్టిన హరీశ్‌రావు : మంత్రి పొంగులేటి