అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Blade Attack | పట్టణంలో (Kamareddy) పట్టపగలు దోపిడీ ఘటన కలకలం రేపింది. స్థానిక విద్యానగర్ కాలనీలో ఇంట్లో ఉన్న ఓ మహిళపై ఆగంతకుడు రేజర్ బ్లేడ్‌తో (Razor Blade Attack) దాడికి తెగబడ్డాడు.
Kamareddy Blade Attack | ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్ కాలనీకి చెందిన జొన్నాల సునీత ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో భోజనం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. రేజర్ బ్లేడుతో ఆమె పెదవిపై గాయపరిచి, చంపుతానని బెదిరించి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కుని పారిపోయాడు. దోచుకెళ్లిన పుస్తెలతాడులో రెండు పోగులు, మూడు బంగారు పూసలు, రెండు పుస్తెలు ఉన్నాయని, దాని విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కామారెడ్డి పోలీసు స్టేషన్లో (Kamareddy Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: చీమ లాంటి వినాయకుడి రథం.. మైక్రో ఆర్టిస్ట్ నైపుణ్యం