అక్షరటుడే, వెబ్డెస్క్: BRS Rythu Garjana | ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు తాండవం చేస్తోంది. రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో అన్నదాతల సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధం అయింది.
రాష్ట్రంలో కరువు, అన్నదాతల ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ ఇప్పటికే ఆందోళనలు చేస్తోంది. కరెంట్ కష్టాలు, సాగునీటి కోసం రైతులతో కలిసి గులాబీ పార్టీ ధర్నాలు, రాస్తారోకోలు చేసింది. అయితే మరింత దూకుడు పెంచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగుతున్నారు. ఉత్తర తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. నవంబర్లో ఏకంగా నాలుగు సభల్లో ఆయన పాల్గొననున్నారు.
BRS Rythu Garjana | రైతు గర్జన సభలు
అన్నదాతల కష్టాలపై రైతు గర్జన పేరిట కేటీఆర్ సభలు నిర్వహించనునారు. నవంబర్ 1 ఆదిలాబాద్, నవంబర్ 11న నిర్మల్, నవంబర్ 19న నిజామాబాద్ జిల్లా (Nizamabad District)ల్లో రైతు గర్జన సభలు నిర్వహిస్తారు అనంతరం నవంబర్ 29న కరీంనగర్లో దీక్షా దివస్ సభ ఏర్పాటు చేయనున్నారు. రైతు గర్జన సభలలో సాగు, తాగునీటి సమస్యలపై ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీయనున్నారు. యాసంగిలో పంటలు సాగు చేయొద్దని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో కేటీఆర్ రైతు గర్జన సభలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి..: Municipal Workers Punctuality | కార్మికులు సమయపాలన పాటించాలి..: మున్సిపల్ కమిషనర్