తెలంగాణRI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ

RI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ

లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్​స్పెక్టర్​ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో చోటు చేసుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : RI Caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. తమ వద్దకు పనుల కోసం వచ్చే వారిని లంచాల పేరిట వేధిస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు. ఇటీవల ఏసీబీ దాడులు పెరిగినా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. తాజాగా లంచం తీసుకుంటూ ఆర్​ఐ ఏసీబీకి చిక్కాడు.

వరంగల్ జిల్లా (Warangal District) దుగ్గొండి మండల రెవెన్యు ఇన్​స్పెక్టర్ రాంబాబు మ్యూటేషన్​ కోసం లంచం డిమాండ్​ చేశాడు. క్షేత్రస్థాయి విచారణ జరిపి తహసీల్దార్‌కు నివేదికను సమర్పించి, ఫిర్యాదిదారుడి పూర్వీకుల ఆస్తికి మ్యుటేషన్ చేయించడానికి రూ. 10 వేలు అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈ మేరకు గురువారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఆర్​ఐ రాంబాబును ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేశారు. నిందితుడైన అధికారిని అరెస్టు చేసి, వరంగల్‌లోని ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.

RI Caught by ACB | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

ఇది కూడా చదవండి..: Narsampet Tension | నర్సంపేట డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత.. రంగంలోకి బండి సంజయ్

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hantavirus Vaccine Delay|పదేళ్ల క్రితమే రావాల్సిన ‘హంటా’ టీకా ఎందుకు రాలేదు? దీని వెనుక షాకింగ్ మిస్టరీ ఇదే!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hantavirus Vaccine Delay|ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న హంటా వైరస్‌కు (Hantavirus)...

Nizamabad Ring Road | నగరానికి రింగ్​రోడ్డు కేటాయించకపోవడం దురదృష్టకరం : ఎమ్మెల్యే ధన్​పాల్​

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Ring Road |నిజామాబాద్ నగరానికి రింగ్​రోడ్డు కేటాయించకపోవడం...

NEET Paper Leak | నీట్ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం..

అక్షరటుడే, కామారెడ్డి: NEET Paper Leak | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన...

Pamula Vagu Bridge | వంతెన నిర్మించలేనందుకు బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి

అక్షరటుడే, లింగంపేట: Pamula Vagu Bridge | మండలంలో (lingampet) వంతెన...