అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: DRO Geetha Felicitation | జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకెళ్దామని డీఆర్వో గీత (nizamabad dro geetha) అన్నారు. ఇటీవల ఆమె జిల్లా రెవెన్యూ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుక్రవారం టీఆర్ఈఎస్ఏ (TRESA) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు కలెక్టరేట్లోని (Nizamabad Collectorate) డీఆర్వో ఛాంబర్లో శుక్రవారం ఆమెను మర్యాదపూర్వకంగా అసోసియేషన్ ప్రతినధులు, ఉద్యోగులు కలిశారు.
DRO Geetha Felicitation | ఎల్లప్పుడూ అండగా ఉంటా..
తనను సన్మానించిన టీఆర్ఈఎస్ఏ జిల్లా అధ్యక్షుడు రమణ్రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్ కుమార్, అసోసియేషన్ ప్రతినిధులకు డీఆర్వో కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా ముందుకు వెళ్దామని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చిన తాను ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డీఆర్వోను కలిసిన వారిలో అసోసియేషన్ వైస్ ప్రసిడెంట్ భూపతి ప్రభు, వినయ్ సాగర్, శైలజ, బోధన్ డివిజన్ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శులు కార్తీక్ రెడ్డి నజీర్ ఉద్దీన్, తహశీల్దార్లు శ్రీధర్, వెంకటరమణ, శాంత, కిరణ్మయి, నరేష్, కోశాధికారి సంపత్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ విజయరామరాజు, నాయబ్ తహశీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు, జీపీవోలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : BJP Ticket Scam | ఇందూరు బీజేపీలో కలకలం.. కార్పొరేటర్ టికెట్ పేరిట డబ్బులు వసూలు..!


