HMDA Ravinder Assets | హెచ్ఎండీఏ చీఫ్​ ఇంజినీర్​ అక్రమాస్తులు మాములుగా లేవుగా..

హెచ్​ఎండీఏ చీఫ్​ ఇంజినీర్​ రవీందర్​ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్​ అయ్యారు. కిలో బంగారం, 12 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HMDA Ravinder Assets | హెచ్​ఎండీఏ చీఫ్​ ఇంజినీర్​ రవీందర్​తో పాటు ఆయన బంధువుల ఇళ్లలో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు (ACB Raids) చేశారు. ఈ సమయంలో భారీగా ఆస్తులను గుర్తించారు.

రవీందర్​ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. 15 బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేశాయి. మైత్రీవనంలోని HMDA ప్రధాన కార్యాలయం, గచ్చిబౌలిలోని సుమధుర టవర్స్‌లో ఉన్న రవీందర్ నివాసం, అలాగే ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై దాడులు జరిగాయి. అధికారులు ఆయన ఇంట్లో కిలో బంగారం, 15 ఫ్లాట్లు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

HMDA Ravinder Assets | అక్రమాస్తుల వివరాలు

రవీందర్​కు సుమధుర అక్రోపాలీస్​లో త్రీ-బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది. శ్రీవారి మెడోస్​లో ఒక ఫ్లాట్, వాసవీ అట్లాంటీస్​లో మూడు ఫ్లాట్లు, కొండాపూర్​ (Kondapur)లో 2 ఫ్లాట్లు, జడ్చర్లలో ఏడు ఫ్లాట్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శంషాబాద్​, షాబాద్​లో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, మసీద్​ బండలో 300 చదరపు గజాల స్థలంలో నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం ఉంది.

HMDA Ravinder Assets | భారీగా బంగారం, వెండీ స్వాధీనం

కిలో బంగారు ఆభరణాలు, 12 కిలోల వెండి వస్తువులు, నాలుగు లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బ్యాంక్ లాకర్లకు సంబంధించిన పత్రాలు, 18 సీసాల విదేశీ మద్యం సీజ్​ చేశారు. లాకర్లలో బంగారు ఆభరణాలు, నగదు, ఇతర విలువైన వస్తువులు ఉన్నాయని, విచారణలో భాగంగా వాటిని త్వరలో తెరుస్తామన్నారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్​లో రూ.200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. రవీందర్​కు సుమారు రూ. 1,16,00,000 విలువైన నాలుగు వాహనాలు ఉన్నాయి.

దీనిని కూడా చదవండి : AE Caught by ACB | రూ.2 లక్షల లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *