అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Surekha Rakhi | కాంగ్రెస్ పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నకిరేకల్‌లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతమైన పథకాలను తీసుకువస్తే కొంత మంది దుర్మార్గులు, సన్నాసులు ప్రభుత్వం ఫెయిల్ అయిందంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పూట వచ్చే గంగిరెద్దుల్లా తిరుగుతు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 2034 నాటికి కోటీ మంది ఆడబిడ్డలకు కోటీశ్వరులను చేయాలని ప్రతి వ్యాపారంలో అవకాశం కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. కేసీఆర్ హయాంలో మహిళలను పట్టించుకోలేదన్నారు.
Konda Surekha Rakhi | సంస్కారం ఉండటంతోనే..
కేసీఆర్ (KCR) తన బిడ్డలకు, బంధువులకు ఉద్యోగాలు ఇస్తే తాము శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనమరాలికి పదవులు ఇచ్చామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో పేదోళ్ల బిడ్డలకు పదవులు వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి చదువు వస్తదో రాదో కాని సంస్కారం ఉందన్నారు. సంస్కారం లేకపోతే ఒక్కడు కూడా రోడ్డు మీద కాలు పెట్టడు.. ఫామ్ హౌస్‌లో పడుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంస్కారం ఉంది కాబట్టే సీతక్క, కొండా సురేఖను ఇంట్లోకి పిలిచి రాఖీ కట్టించుకున్నాని సీఎం తెలిపారు. సొంత చెల్లిని మెడ పట్టి ఆస్తి కోసం బయటకు నెట్టిన వ్యక్తికి, తనకు పోలికా అన్నారు.
Konda Surekha Rakhi | ఆస్తి కోసం ఇంట్లో నుంచి గెంటేశాడు
కేసీఆర్ బిడ్డ తీహార్ జైలు నుంచి ఇంటికిపోతే ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కేటీఆర్ ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని సీఎం ఆరోపించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, ఇలాంటోడు కోటీ మంది ఆడబిడ్డల బాగోగులు చూస్తాడా అని ప్రశ్నించారు. పుట్టింటికి ఆడబిడ్డ వస్తే ఇంట్లోకి పిలిచి ఇంత అన్నం పెడతారు.. సొంత చెల్లి ని ఇంట్లో నుంచి బయటకు నెడితే కొడుకును మందలించకుండా కేసీఆర్ ఫామ్ హౌస్‌లో పడుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో జీతం తీసుకుంటున్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ సంచలన సవాల్
BRS నేతలు కేటీఆర్, హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన సవాల్ విసిరారు. “కాస్కోండి కల్వకుంట్ల కుటుంబమా!, ఈ నెలాఖరుకు సిరిసిల్ల వస్తా, వచ్చే నెల సిద్దిపేట వస్తాను. సిరిసిల్లపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. సిద్దిపేటపై మా కాంగ్రెస్ కార్యకర్తలు దండయాత్ర… pic.twitter.com/6sVsk6gORp
— Akshara Today | Telugu News (@aksharatoday) September 5, 2026
దీనిని కూడా చదవండి : Palm Oil Paneer | పామాయిల్‌తో పనీర్ తయారీ.. 3 డెయిరీల లైసెన్సులు రద్దు