అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: ACB Raids Nzb Municipality | నగరం (Nizamabad)లోని మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు.
కార్యాలయంలోని ఎస్లాబ్లిష్మెంట్ సెక్షన్లో..
అకౌంట్స్ సెక్షన్లో ఓ అధికారి, ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఒకరు డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో ఏసీబీ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు కార్యాలయంలో రాకపోకలను స్తంభింపజేశారు. కార్యాలయంలోని ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్‌ను మూసివేసి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Poshan Awareness Programs | పోషణకు అభయం.. అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు