Bajireddy Govardhan | సీఎం రేవంత్ రెడ్డిని పడగొట్టేది ఎమ్మెల్యేలే : మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Bajireddy Govardhan | కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రభుత్వ వైఫల్యాలతో గ్రామాల్లో తిరిగే పరిస్థితి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్(BRS) నేత బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Bajireddy Govardhan | నిధులు విడుదల చేయడంలో జాప్యంపై..

బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పిన విధంగా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో చివరకు ఎమ్మెల్యేలే సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) పడగొట్టేది ఎమ్మెల్యేలే అని బాజిరెడ్డి గోవర్ధన్ వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడం లేదన్నారు.

Bajireddy Govardhan | పోచారంపై విమర్శలు

బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కూడా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్‌లో ఉండి, ప్రభుత్వం మారిన అనంతరం కాంగ్రెస్‌లో చేరారన్నారు. . రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, నిలిచిపోయిన సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీజీ గౌడ్, జుబేర్, శ్రీనివాస్ రావు, అంజిరెడ్డి, ధర్మతేజ, మోచి గణేష్, రమేష్ యాదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Ayodhya Ram Mandir SIT | అయోధ్య విరాళాల కేసులో కీలక పరిణామం.. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాకు క్లీన్‌చిట్

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *